2, జులై 2017, ఆదివారం

జాతీయ వైద్యదినోత్సవ సందర్భంగా


" వైద్యో నారాయణో హరిః "
మ. ఉదితంబయ్యెను వైద్యరంగమున 'ఆయుర్వేదమన్
యుధ్ధమే
ఎదురేలేని మహారుజారుల విదారింపంగ దివ్యౌషధీ
భిదురం బీయరె మానవాళి కిల గంభీరాటవీ
సంపదల్
కదనోత్సాహులు "వైద్యశ్రీహరులు" లోకంబేలు
'నారాయణుల్.'
తే. తరచి యోషధీసాగర తత్త్వగుణము
'శుశ్రుతుండు' రచించెను 'శుశ్రుతంబు'
'చరకసంహిత'ను రచించె 'చరకవెజ్జు'
ప్రజల పాలిటను 'హరినారాయణు'లయి.
తే. ధరణి ప్రాణాంతకవ్యాధితతుల బాపి
మగుడ ప్రాణము పోయుచు, మానవాళి
మనుగడకు సేవ సల్పెడు మాన్యులైన
"వైద్యనారాయణహరుల" ప్రస్తుతింతు.
'పద్యకవితిలక', 'సరసకవి'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి