17, ఏప్రిల్ 2017, సోమవారం

16, ఏప్రిల్ 2017, ఆదివారం

తెలుగు నాటకరంగదినోత్సవ శుభాకాంక్షలు.






 



సాహితీ కాళిదాసం




"సంగీత సాహిత్య భూషణ" శ్రీ రేకపల్లి శ్రీనివాస
మూర్తిగారితో "నన్నయ వాఙ్మయ వేదిక"
నిర్వహించిన "సాహితీ కాళిదాసం" సందర్భంగా

శ్రీ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భముగా


శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భముగా




పుస్తకావిష్కరణ



1, ఏప్రిల్ 2017, శనివారం

"పరవస్తు పీఠం" విశాఖపట్నం వారు ఉగాది సందర్భముగా నిర్వహించిన కవి సమ్మేళనంలో


"పరవస్తు పీఠం" విశాఖపట్నం వారు ఉగాది సందర్భముగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న సందర్భము లో గురుసహస్రావధాని శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారిచే సన్మానం

తూర్పు గోదావరి జిల్లా సాంస్కృతిక శాఖ కాకినాడలో నిర్వహించిన హేవిళంబి నామ ఉగాది ఉత్సవాలలో



తూర్పు గోదావరి జిల్లా సాంస్కృతిక శాఖ కాకినాడలో నిర్వహించిన హేవిళంబి నామ ఉగాది ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ శ్రీ అరుణ కుమార్ గారిచే జరుపబడిన కవి సన్మానం చిత్రంలో కాకినాడ M.L.A.శ్రీ వనమాడి వెంకటేశ్వర రావు,M.L.C శ్రీ చిక్కాల రామచంద్ర రావు ప్రభృతులు ఉన్నారు

హేమలంబనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు"

హేమలంబనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు"
"కలంచునే రుచుల మాయల్ ధీరచిత్తంబులన్?"
సీ. కోకిలమేళాలు కూజితగానాల,
తుమ్మెదల్ తాళాల తొందరింప,
'ఋతురాజు' శృంగార కృతిగీతులు రచింప,
ప్రకృతికాంత మిగుల పరవశింప,
మాకంద ఫలము లన్ మాన్యలోలకు లూని,
వివిధపుష్పభరిత వేణి దాల్చి,
తే. క్రొత్త రాజధానిని సమకూర్చుకొనెడు
వేరుపడిన యాంధ్రుల మది నూరడింప,
"హేమలాంబాత్మజాత"తో నేడుగడకు
సాగివచ్చెను నేడు వాసంతలక్ష్మి.
మ. పులుపున్, తీపియు, చేదు మున్నగు రుచుల్
పొల్పొందగా పచ్చడిన్
తలిరుంబోడు లుగాది జేతురు, గతార్థంబౌ
సుఖశ్రేణికిన్
పలు దుఃఖాల ప్రతీకయౌ నదియె, జీవవ్యాపృతిన్
చక్రమై
యలవోకౌను, కలంచునే రుచులమాయల్
ధీరచిత్తంబులన్?
శా. అవ్యాజంబగు ప్రేముడిన్ సుతుల నాప్యాయంబుగా
జూచుచున్
భవ్యంబై మనుచున్న యాంధ్రజననీ స్వాంతంబు
వ్రయ్యంబడెన్,
దివ్యంబౌ భవితవ్యమున్ బడయగా "తెల్గుల్",
వరంబీయవే
నవ్యాబ్దంబవు "హేమలంబ!" కరుణన్ "నవ్యాంధ్రి"
వర్ధిల్లగన్.
'పద్యకవితిలక', 'సరసకవి', 'ఆంధ్రశ్రీ', 'గురుశ్రేష్ఠ'
'సహృదయ చక్రవర్తి'
డాక్టర్ సంగాడి వీరరాఘవేంద్రరావు
రాజమహేంద్రవరం

ప్రజా పత్రిక 90 వ వార్షికోత్సవం



ప్రజా పత్రిక 90 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహింపబడిన కవిసమ్మేళనం సందర్భంగా సన్మానం మరియు 
ప్రజా పత్రిక 90 వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన అతిథులతో