4, జులై 2017, మంగళవారం

విప్లవజ్యోతి' అల్లూరి సీతారామరాజు 120 వ జయంతి సందర్భంగా



            "విప్లవజ్యోతికి వందనశతము"

"భరతమాతృ దాస్యమును బాపనెంచి
'తెలుగు తేజమ్ము' చవిచూపి, తెల్లవారి
నల్లగుండెల నిద్రించి నలచి నలచి,
'మిరపకాయ టపా'లతో మెరపుదాడి
ప్రక్కబల్లెమై సలుపుచు 'నెక్కటి' యయి
ముప్పుతిప్పలు పెట్టిన 'గొప్పధన్వి!'
'విప్లవజ్యోతి' 'అల్లూరి' విశదకీర్తి!
శౌర్యమూర్తి! మా "వందన శతము" గొనుము!"

              'పద్యకవితిలక'  'సరసకవి'
            డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

2, జులై 2017, ఆదివారం

జాతీయ వైద్యదినోత్సవ సందర్భంగా


" వైద్యో నారాయణో హరిః "
మ. ఉదితంబయ్యెను వైద్యరంగమున 'ఆయుర్వేదమన్
యుధ్ధమే
ఎదురేలేని మహారుజారుల విదారింపంగ దివ్యౌషధీ
భిదురం బీయరె మానవాళి కిల గంభీరాటవీ
సంపదల్
కదనోత్సాహులు "వైద్యశ్రీహరులు" లోకంబేలు
'నారాయణుల్.'
తే. తరచి యోషధీసాగర తత్త్వగుణము
'శుశ్రుతుండు' రచించెను 'శుశ్రుతంబు'
'చరకసంహిత'ను రచించె 'చరకవెజ్జు'
ప్రజల పాలిటను 'హరినారాయణు'లయి.
తే. ధరణి ప్రాణాంతకవ్యాధితతుల బాపి
మగుడ ప్రాణము పోయుచు, మానవాళి
మనుగడకు సేవ సల్పెడు మాన్యులైన
"వైద్యనారాయణహరుల" ప్రస్తుతింతు.
'పద్యకవితిలక', 'సరసకవి'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు