తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి
బ్రహ్మోత్సవ వాహనవైభవం
మ. గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్
నిజపట్టంబున మాడవీదుల
సదా నీలాభ్రదేహుండు తా
ధ్వజఛత్రాదిక లాంఛనంబుల
భళా ! వాహ్యాళి గావించుచున్
నిజభక్తాళికి దర్శనం
బిడు శతానీకాతిభోగంబులన్.
పెద్దశేషవాహనం
మ. అదిగో కాంచుడు ! శేషవాహనంబుపై సాలంకృతుండై ప్రభా
ముదమౌ వజ్రకిరీటధారియయి
యామోదాగ్రమాలల్ ధరిం
చి, ధరాశ్రీమహిషీసమేతుడయి యా శ్రీవిష్ణురూపంబునన్
సదయన్ వేంకటసామి
భక్తతతికిన్ సాక్షాత్కరించెన్ దగన్.
రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి