విమలాదిత్య
తనూజ !రాజిత మహావేంగీ మహాజాని !పం
చమవేదప్రథితాంధ్రభారత
మహా సత్కావ్యకర్త్రాశ్రయా !
హిమవజ్జావర
నిత్యపూజన తపస్వీ ! రాజరాజాహ్వయా !
అమృతాకార
!చళుక్యరాజ !కొనుమయ్యా ! సన్నుతుల్, హారతుల్.
పంచమవేదమై
పరగు భారతమున్ నన్నపార్యుడన్
ప్రాంచిత
సత్కవీశకృషికాగ్రణి నీ యభిలాష మెరకున్
గాంచడె
తెల్గునేలతొలికావ్యపు పంటను, రాజరాజ ! కా
మించుయశోలతాంగి
నిను, మించెడు దక్షపురీశ్వరాదృతిన్.
ఘనమణిదీప్తి
కంకణము, కంకణదీప్తిని రత్న మెవ్విధిన్
మనునొ
విశేషశోభగని; మానితకీర్తిని నన్నపార్యుడున్
గనె నటు
నీదు ప్రాపుగని; కాంచితి వీవు చిరప్రశస్తి నా
తని కృతి
భారతంబుగొని, దక్కె యశోనిధి రాణ్మహేంద్రికిన్
దనరెడు
గంధభూరుహపుతావులు భూమికి నబ్బునట్లుగన్.
రాజమహేంద్రి
ధన్య, కవిరాజ ! మిముంగని; ధన్యుదయ్యె నా
రాజనరేంద్రు
డాశశివిరాజిత కీర్తిసమార్జనంబునన్
తేజమునొంది
రాంధ్రులు త్వదీయ కృతిన్; గయికొమ్ము భక్తి నీ
రాజనముల్
బుధావళినిరంతర మర్చనసేయు నిమ్ములన్
డా.యస్వీ రాఘవేంద్ర రావు .