28, ఆగస్టు 2018, మంగళవారం

అమృతభాష తెలుగు

తెలుగు భాషాదినోత్యవ శుభాకాంక్షలు.
అమృతభాష తెలుగు
కోకిలమ్మ పాటయు, పసికూన ముద్దు
మాట, ముత్యాల మూటయు, మల్లెతోట,
తేటిపాట, నెమలియాట, తేనెయూట,
జగతిని తెలుగు మాటకు సాటి రావు.
'జనని జన్మభూమి స్వర్గమ్ము కన్నను
గొప్ప' యనుచు బుధులు చెప్పిరన్న !
మాత, యొడిని నేర్ప మనుజు తీరిచిదిద్దు
మాతృభాష గొప్ప మరువకన్న !
"అమ్మ","నాన్న"మాటలలోని కమ్మదనము,
"మమ్మి","డాడి"లందు గలదె మచ్చుకైన,
వెర్రి మోజేల పాశ్చాత్య వేషభాష
లనిన, మాతృభాషను ప్రేమ నాదరించు !
సంస్కృతి పరిరక్షకము భాషామతల్లి,
జాతికిన్ జీవగర్ర భాషామతల్లి,
"నాదు భాష , నా దేశము, నాదు ప్రజలు"
ననెడునభిమానముగలిగిమనగవలయు.
సతతము మన యింటను, బయ
ట తెలుగులో మాటలాడుటకు
పూనుమయా!
"మృతభాషగ కానీయ" మ
మృతభాష తెలు"గని జగతి
కెరిగింపవయా!
'పద్యకవితిలక', 'సరసకవి'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు.

2 వ్యాఖ్యలు: