25, మార్చి 2018, ఆదివారం
21, మార్చి 2018, బుధవారం
వనదేవతలు
అంతర్జాతీయ అటవీ దినోత్సవ సందర్భంగా, వనదేవతలు
వనమును దేవతంచు తనివార ననాదిగ
గొల్ఛి సల్పదే
మనమున భక్తితత్పరత మానవజాతి
మహోత్సవంబులన్,
తనయుల పూజమెచ్చి వనదైవము
సూనఫలంబులోషధుల్
అనుపమరాగవత్సలత నందగజేయదె
స్వాస్థ్యభుక్తులన్.
వనసీమల్ మునిసీమలై వరలె నా ప్రాచీన
కాలంబునన్,
మునులు న్నైఛ్ఛిక విద్య శిష్యులకు
సంపూర్ణంబుగా నేర్పరే ?
మునిపత్నుల్ గడు పుత్రవత్సలత
కంభోరాశులై సాకరే ?
మునిరాజ్యంబులె యాశ్రమాల్,
గురుకులంబుల్ నైమిశారణ్యముల్.
- నా "పుడమితల్లి" కావ్యము నుండి
'పద్యకవితిలక', 'సరసకవి'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)