28, ఆగస్టు 2018, మంగళవారం

అమృతభాష తెలుగు

తెలుగు భాషాదినోత్యవ శుభాకాంక్షలు.
అమృతభాష తెలుగు
కోకిలమ్మ పాటయు, పసికూన ముద్దు
మాట, ముత్యాల మూటయు, మల్లెతోట,
తేటిపాట, నెమలియాట, తేనెయూట,
జగతిని తెలుగు మాటకు సాటి రావు.
'జనని జన్మభూమి స్వర్గమ్ము కన్నను
గొప్ప' యనుచు బుధులు చెప్పిరన్న !
మాత, యొడిని నేర్ప మనుజు తీరిచిదిద్దు
మాతృభాష గొప్ప మరువకన్న !
"అమ్మ","నాన్న"మాటలలోని కమ్మదనము,
"మమ్మి","డాడి"లందు గలదె మచ్చుకైన,
వెర్రి మోజేల పాశ్చాత్య వేషభాష
లనిన, మాతృభాషను ప్రేమ నాదరించు !
సంస్కృతి పరిరక్షకము భాషామతల్లి,
జాతికిన్ జీవగర్ర భాషామతల్లి,
"నాదు భాష , నా దేశము, నాదు ప్రజలు"
ననెడునభిమానముగలిగిమనగవలయు.
సతతము మన యింటను, బయ
ట తెలుగులో మాటలాడుటకు
పూనుమయా!
"మృతభాషగ కానీయ" మ
మృతభాష తెలు"గని జగతి
కెరిగింపవయా!
'పద్యకవితిలక', 'సరసకవి'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు.

17, జూన్ 2018, ఆదివారం

పితృదినోత్సవం' సందర్భంగా

'పితృదినోత్సవం' సందర్భంగా
మ. గురువై నేర్పితి 'వోనమాలను' సదా కూర్మిన్
ప్రసాదించుచున్,
గురువై నేర్పితి 'పద్యవిద్య' కవితల్ గూర్పంగ
ధీయుక్తిమై,
గురువున్ జేసితి నన్ను, తండ్రి కొడుకున్
గొల్వుండ నొండౌ బడిన్
అరుదౌ ఘట్టము నిర్వహింపబడెగా నచ్చోట
'స్వర్ణోత్సవాల్.'
ఉ. కొంత వయస్సు వచ్చువరకున్ దగు లాలన
పాలనంబులన్,
కొంత వయస్సు వచ్చువరకున్ తగు శిక్షణ
దండనంబులన్,
కొంత వయస్సు మీర దగు కూరిమి నేస్తపు
వర్తనంబులన్
సంతును పెంచగా వలయు జంపతులంచు
నెరింగి సాకరే ?
ఉ. బాగుగ రేల మీకు కనుపట్టకపోవుట నే
పఠించితిన్
భాగవతమ్ము, రామకథ, భారత ముఖ్య
ప్రబంధరాజముల్
ఆ గతి సాగినట్టి కవితాంబ సమర్చన
నన్ను సాకెరా !
నా గురువైతి వీవపుడు, నా గురువైతివి
'పద్య విద్యకున్.'
'పద్యకవితిలక'

3, మే 2018, గురువారం

డా కేసాప్రగడ సత్యనారాయణ గారి గృహప్రవేశం సందర్భముగా


పత్రికాస్వేఛ్ఛారక్షణదిన సందర్భంగా

పత్రికాస్వేఛ్ఛారక్షణదిన సందర్భంగా
పత్రిక జాతికి బలము, పత్రిక జాతికి గళము,
పత్రిక జాతికి స్ఫూర్తి, పత్రిక జాతికి కీర్తి,
పత్రిక జాతి వివేకవర్ధని, ఆపదుధ్ధరణి,
పత్రిక జాతికి జ్యోతి, వర్ధిల్లు నీ జ్యోతి చిరము.
అట్టి పత్రికాస్వేఛ్ఛను హరణజేయ
యత్నమొనరించు టద్ది యన్యాయమగును,
అది ప్రజాస్వామ్యవృక్షాన కగును సుమ్ము
పెద్ద గొడ్డలిపెట్టుగా, నిద్ది నమ్ము!
ఇట్టి "పత్రికాస్వేఛ్ఛ రక్షించుకొమ్ము!"
'పద్యకవితిలక', 'సరసకవి'
డా. యస్వీ. రాఘవేంద్రరావు

25, మార్చి 2018, ఆదివారం

శ్రీ రామనవమి శుభాకాంక్షలు



శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది సందర్భంగా


శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది సందర్భంగా






శ్రీనన్నయభట్టారకపీఠం తణుకు శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన ప్రసార మాధ్యమాలు-ప్రభావాలు

శ్రీనన్నయభట్టారకపీఠం తణుకు శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన ప్రసార మాధ్యమాలు-ప్రభావాలు అనే అంశంపై రాష్ట్రస్థాయి పద్యకవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన సందర్భముగా







21, మార్చి 2018, బుధవారం

వనదేవతలు

అంతర్జాతీయ అటవీ దినోత్సవ సందర్భంగా,                వనదేవతలు


వనమును దేవతంచు తనివార ననాదిగ
                                 గొల్ఛి సల్పదే
మనమున భక్తితత్పరత మానవజాతి
                                          
                            మహోత్సవంబులన్,
తనయుల పూజమెచ్చి వనదైవము
                      సూనఫలంబులోషధుల్
అనుపమరాగవత్సలత నందగజేయదె
                                 స్వాస్థ్యభుక్తులన్.

వనసీమల్ మునిసీమలై వరలె నా ప్రాచీన
                                  కాలంబునన్,
మునులు న్నైఛ్ఛిక విద్య శిష్యులకు
                     సంపూర్ణంబుగా నేర్పరే ?
మునిపత్నుల్ గడు పుత్రవత్సలత
                     కంభోరాశులై సాకరే ?
మునిరాజ్యంబులె యాశ్రమాల్,
                గురుకులంబుల్  నైమిశారణ్యముల్.
       -  నా "పుడమితల్లి" కావ్యము నుండి
               'పద్యకవితిలక', 'సరసకవి'
           డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

21, ఫిబ్రవరి 2018, బుధవారం