12, మార్చి 2017, ఆదివారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా "జనని"మానసిక దివ్యాన్గుల సంస్థ అధినేత్రి "శ్రీమతి కలిదిండి హైమలీల"గారికి రివర్ బే హోటల్ లో లయన్స్ క్లబ్ అఫ్ విమెన్ రాజమహేంద్రవరం వారిచే సన్మానం జరిగిన సందర్భముగా 
ముఖ్య అతిధి భారతీయం సత్యవాణి గారు.

8, మార్చి 2017, బుధవారం

"మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు" " మహిళా దినోత్సవ దర్భంగా

"మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు"

సీ. మమతానురాగాల మానవతామూర్తి
ధన్యాత్మురాలైన తల్లి, మహిళ,
ఆత్మీయతాభావ మభిమాన దీప్తియై
చెలికార మొలికించు చెల్లి, మహిళ,
మగని ప్రఖ్యాతిలో సగపాలు పోషించు
ఆనందవల్లి యిల్లాలు, మహిళ,
కారుణ్య సహనాది గణనీయ సుగుణాల
పాలవెల్లిని కల్పవల్లి, మహిళ,
తే. తల్లి, యిల్లాలు, చెల్లెలై యుల్లసిల్లు
వనిత పూరుషాహంకార బలిపశువుగ
నయ్యె నయ్యయ్యొ ! వేధింపు లగ్గలముగ,
'మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు."
'పద్యకవితిలక', 'సరసకవి',' ఆంధ్రశ్రీ' 'గురుశ్రేష్ఠ'
డాక్టర్ యస్వీ.రాఘవేంద్రరావు.