31, అక్టోబర్ 2014, శుక్రవారం
27, అక్టోబర్ 2014, సోమవారం
నీ విలాసము లవేద్యంబులుగదే ఈశ్వరా !
నీ విలాసము లవేద్యంబులుగదే ఈశ్వరా !
మ. తలపైనన్ బెనుజుట్టు , దేవనది, రుద్రాక్షల్, విబూదిన్ మెయిన్
గళసీమన్ గరళంబు, మేనను భుజంగంబుల్, త్రిశూలాయుధా !
మొల యందున్ గజచర్మమున్, డమరువున్, పుఱ్ఱెల్, గణంబుల్, సదా
యల సామేన సతిన్ భరింతువు మహేశా ! నన్ భరింపంగదే ?
కం. గట్టుల రాయని యనుగుం
బట్టిని రహి జెట్టవట్టి వరలుదువయ్యా
గట్టింట, గట్టువిలుతుడ !
గట్టెక్కింపంగ నీలకంధర రారా !
మ. లయకాలుండవు, నుబ్బులింగడవు, కాలాంతంబునన్ లోకమున్
లయమొందింతువు భీకరాకృతిని; బోళాశంకరా ! నిన్ చిదా
లయమందెవ్వరు కొల్తురో పశుపతీ ! లాలింతు వారిన్ సదా
దయపాలించుచు; నీవిలాసము లవేద్యంబుల్ గదే ఈశ్వరా !
ఉ. వెన్నుడు, బ్రహ్మయున్ కరము విజ్ఞత గోల్పడి యిర్వురున్ సుసం
పన్ననిరూఢ హంకృతుల స్పర్ధను వచ్చిన, లింగరూపివై
పన్నిక వారి గర్వమును బాపి, యసత్యము పల్కు బ్రహ్మకున్
గ్రన్నన శాపమిచ్సితివి కానగ శక్యమె ? నీ మహత్వముల్ ?
సీ. శిరసుపై గంగమ్మ చిందులు వేయుట
నిత్యాభిషేకమ్ము నీలకంఠ !
ఒడలిపైని విభూతి యొప్పారుచుండుట
సంతత స్నానమ్ము సాంబమూర్తి !
నాగహారచయమ్ము నర్తించు చుండుట
విరచితాభరణమ్ము విశ్వనాథ !
బాల శశాంకుండు ప్రభలీనుచుండుట
జ్యోత్స్నలు నిరతమ్ము వ్యోమకేశ !
తే.గీ. ఆచలకన్యా మనోహరార్ధాంగ మహిత !
ఏనుగుందోలుదాల్ప ! యో కృత్తివాస !
శంకరా ! యనవరత శ్మశానవాస !
ఈశ్వరా ! నీదు లీలల నెఱుగవశమె ?
(ఆంధ్రపద్యకవితాసదస్సు "శివలీలల"పై రాజమహేంద్రవరంలో నిర్వహించిన
కవిసమ్మేళనంలో గానంచేసినవి.)
డా.యస్వీ. రాఘవేంద్రరావు,
ఎం.ఎ., బి.ఇ.డి., ఎం.ఫిల్., పిహెచ్.డి.,
రాజమహేంద్రవరం.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)