26, మే 2017, శుక్రవారం

మూడు వసంతాల ముచ్చట పాలన

మూడు వసంతాల ముచ్చట పాలన

ఉ. ఏడుగడంచు నెంచరె 'నరేంద్ర పథంబులు'
                         'జన్ ధనంబులన్',
    వీడరె 'నల్లడబ్బు' తమి వేడ్క 'కుబేరులు'
                          నోట్లరద్దుతో,
    'మూడు వసంతముల్' గడచె ముచ్చట పాలన
                           భారతావనిన్
   ' మోడి' ప్రధాన మంత్రిగ విమోహము నందగ
                            విశ్వమంతయున్."

     'పద్యకవితిలక', 'సరసsకవి','ఆంధ్రశ్రీ', 'గురుశ్రేష్ఠ'
                  'సహృదయ చక్రవర్తి'
            డాక్టర్ సంగాడి వీరరాఘవేంద్రరావు

14, మే 2017, ఆదివారం

"కాటను" జయంతి సందర్భముగా


ఉ. "కాటను" నిర్మితంబైన కట్టడముల్ బహుకాలముండె, చే

వాటముతోడ నీతి విడి వారధులన్ రచియింప గూలవే ?
నేటి స్వతంత్రభారతపు నీతిది, లంచమె రాజ్యమేలు, మో
మోటములేక కోటులను మూటలుగట్టుట పాటి యయ్యెడిన్
"పద్యకవితిలక"
డా.యస్వీ.రాఘవేంద్రరావు,
ఎం.ఏ.,బి.ఇడి.,ఎం.ఫిల్.,పిహెచ్.డి