1, ఏప్రిల్ 2017, శనివారం
హేమలంబనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు"
హేమలంబనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు"
"కలంచునే రుచుల మాయల్ ధీరచిత్తంబులన్?"
సీ. కోకిలమేళాలు కూజితగానాల,
తుమ్మెదల్ తాళాల తొందరింప,
'ఋతురాజు' శృంగార కృతిగీతులు రచింప,
ప్రకృతికాంత మిగుల పరవశింప,
మాకంద ఫలము లన్ మాన్యలోలకు లూని,
వివిధపుష్పభరిత వేణి దాల్చి,
తే. క్రొత్త రాజధానిని సమకూర్చుకొనెడు
వేరుపడిన యాంధ్రుల మది నూరడింప,
"హేమలాంబాత్మజాత"తో నేడుగడకు
సాగివచ్చెను నేడు వాసంతలక్ష్మి.
తుమ్మెదల్ తాళాల తొందరింప,
'ఋతురాజు' శృంగార కృతిగీతులు రచింప,
ప్రకృతికాంత మిగుల పరవశింప,
మాకంద ఫలము లన్ మాన్యలోలకు లూని,
వివిధపుష్పభరిత వేణి దాల్చి,
తే. క్రొత్త రాజధానిని సమకూర్చుకొనెడు
వేరుపడిన యాంధ్రుల మది నూరడింప,
"హేమలాంబాత్మజాత"తో నేడుగడకు
సాగివచ్చెను నేడు వాసంతలక్ష్మి.
మ. పులుపున్, తీపియు, చేదు మున్నగు రుచుల్
పొల్పొందగా పచ్చడిన్
తలిరుంబోడు లుగాది జేతురు, గతార్థంబౌ
సుఖశ్రేణికిన్
పలు దుఃఖాల ప్రతీకయౌ నదియె, జీవవ్యాపృతిన్
చక్రమై
యలవోకౌను, కలంచునే రుచులమాయల్
ధీరచిత్తంబులన్?
పొల్పొందగా పచ్చడిన్
తలిరుంబోడు లుగాది జేతురు, గతార్థంబౌ
సుఖశ్రేణికిన్
పలు దుఃఖాల ప్రతీకయౌ నదియె, జీవవ్యాపృతిన్
చక్రమై
యలవోకౌను, కలంచునే రుచులమాయల్
ధీరచిత్తంబులన్?
శా. అవ్యాజంబగు ప్రేముడిన్ సుతుల నాప్యాయంబుగా
జూచుచున్
భవ్యంబై మనుచున్న యాంధ్రజననీ స్వాంతంబు
వ్రయ్యంబడెన్,
దివ్యంబౌ భవితవ్యమున్ బడయగా "తెల్గుల్",
వరంబీయవే
నవ్యాబ్దంబవు "హేమలంబ!" కరుణన్ "నవ్యాంధ్రి"
వర్ధిల్లగన్.
జూచుచున్
భవ్యంబై మనుచున్న యాంధ్రజననీ స్వాంతంబు
వ్రయ్యంబడెన్,
దివ్యంబౌ భవితవ్యమున్ బడయగా "తెల్గుల్",
వరంబీయవే
నవ్యాబ్దంబవు "హేమలంబ!" కరుణన్ "నవ్యాంధ్రి"
వర్ధిల్లగన్.
'పద్యకవితిలక', 'సరసకవి', 'ఆంధ్రశ్రీ', 'గురుశ్రేష్ఠ'
'సహృదయ చక్రవర్తి'
డాక్టర్ సంగాడి వీరరాఘవేంద్రరావు
రాజమహేంద్రవరం
'సహృదయ చక్రవర్తి'
డాక్టర్ సంగాడి వీరరాఘవేంద్రరావు
రాజమహేంద్రవరం
12, మార్చి 2017, ఆదివారం
8, మార్చి 2017, బుధవారం
"మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు" " మహిళా దినోత్సవ దర్భంగా
"మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు"
సీ. మమతానురాగాల మానవతామూర్తి
ధన్యాత్మురాలైన తల్లి, మహిళ,
ఆత్మీయతాభావ మభిమాన దీప్తియై
చెలికార మొలికించు చెల్లి, మహిళ,
మగని ప్రఖ్యాతిలో సగపాలు పోషించు
ఆనందవల్లి యిల్లాలు, మహిళ,
కారుణ్య సహనాది గణనీయ సుగుణాల
పాలవెల్లిని కల్పవల్లి, మహిళ,
తే. తల్లి, యిల్లాలు, చెల్లెలై యుల్లసిల్లు
వనిత పూరుషాహంకార బలిపశువుగ
నయ్యె నయ్యయ్యొ ! వేధింపు లగ్గలముగ,
'మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు."
ధన్యాత్మురాలైన తల్లి, మహిళ,
ఆత్మీయతాభావ మభిమాన దీప్తియై
చెలికార మొలికించు చెల్లి, మహిళ,
మగని ప్రఖ్యాతిలో సగపాలు పోషించు
ఆనందవల్లి యిల్లాలు, మహిళ,
కారుణ్య సహనాది గణనీయ సుగుణాల
పాలవెల్లిని కల్పవల్లి, మహిళ,
తే. తల్లి, యిల్లాలు, చెల్లెలై యుల్లసిల్లు
వనిత పూరుషాహంకార బలిపశువుగ
నయ్యె నయ్యయ్యొ ! వేధింపు లగ్గలముగ,
'మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు."
'పద్యకవితిలక', 'సరసకవి',' ఆంధ్రశ్రీ' 'గురుశ్రేష్ఠ'
డాక్టర్ యస్వీ.రాఘవేంద్రరావు.
డాక్టర్ యస్వీ.రాఘవేంద్రరావు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)












